Gossipsరకుల్ పని ఇంత దారుణంగా మారిందా..!

రకుల్ పని ఇంత దారుణంగా మారిందా..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమి లేక సతమతమవుతుంది. కెరియర్ సంక్షోభంలో ఉన్న అమ్మడు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదుకోవాలని అనుకోవట్లేదు. అందులో భాగంగానే నాని, విక్రం కుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో ఐటం సాంగ్ కు ఓకే చెప్పిందట. ఇక ఇప్పుడు సీనియర్ స్టార్ హీరో పక్కన జోడీ కట్టేందుకు సై అన్నదట. అంతేకాదు ఆ సినిమాలో రకుల్ ఆ హీరోకి భార్యగా నటిస్తుందట.

నిన్నటిదాకా కెరియర్ లో జోష్ కనిపించగా ఇప్పుడు రకుల్ ఏ అవకాశం వచ్చినా చేయక తప్పట్లేదు. ఎన్నో ఆశలతో కోలీవుడ్ లో అడుగు పెట్టినా అక్కడ పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అందుకే కింగ్ నాగార్జున నటిస్తున్న మన్మథుడు-2లో నాగార్జున భార్యగా నటిస్తుంది రకుల్. చిలసౌతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో మన్మథుడు-2 తెరకెక్కుతుంది. స్క్రిప్ట్ ఆల్రెడీ ఫైనల్ అవగా త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈమధ్య నెటిజెన్స్ తో ట్రోల్స్ కు గురైన రకుల్ ఇప్పుడు చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో కాస్త వెనక్కి తగ్గింది. అయితే వారానికో ఫోటో షూట్ తో మళ్లీ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తుంది అమ్మడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news