Gossipsఆలోచనలో పడ్డానంటోన్న రకూల్ ! ఎందుకో తెలుసుకోవద్దు

ఆలోచనలో పడ్డానంటోన్న రకూల్ ! ఎందుకో తెలుసుకోవద్దు

తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ  స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీగా మారింది   రకుల్‌ప్రీత్‌సింగ్ . వరుస విజయాలతో అటు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ  గ్లామర్ భామ . అటు కుర్ర హీరోల సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళంలో కూడా బిజీగా మారింది.  తాజాగా ఆమె కార్తితో కలిసి నటించిన చిత్రం ‘ఖాకి’ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హౌస్‌వైఫ్ పాత్రలో రకుల్ అందరి మనసులు దోచేసుకుంది.

ఈ సినిమా విషయంలో మొదట దర్శకుడు ఫోన్ చేసి ఇందులో హౌస్‌వైఫ్ పాత్ర అని చెప్పగానే ఆలోచనలో పడ్డా. హౌస్‌వైఫ్ అంటే పెద్ద వయస్సు ఉన్న ఆంటి పాత్ర కాదని.. అప్పుడే పెళ్ళయిన కొత్త జంటగా కనిపిస్తానని దర్శకుడు చెప్పడంతోపాటు పాత్ర కూడా కొత్తగా ఉంటుందని ఓకె చెప్పేశా అంటోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ . ఇలా భిన్నమైన పాత్రలు చేస్తేనే కదా మనకు మంచి పేరొస్తుంది కదా అంటూ గడుసు సమాధానం  చెప్తోంది .

Rakul Preet Singh

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాను ఈ నాలుగేళ్లలో దాదాపు పదిహేను సినిమాలు చేశాను. కొందరేమో రకుల్ స్పీడ్‌కు సాటి హీరోయిన్స్‌కు టెన్షన్ పట్టుకుందంటూ రాస్తున్నారు. అయినా ఇంత స్పీడ్‌గా సినిమాలు చేస్తే తొందరగా రిటైర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి  సినిమాలు బాగా తగ్గించా అందుకే ఈమధ్యే నెలరోజులు హాలిడేస్‌ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశా, దానికి రకుల్‌కు అవకాశాలు తగ్గాయి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని వాపోతోంది ఈ జిమ్ స్లిమ్ బ్యూటీ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news