ఆ దర్శకుడి సెంటిమెంట్ కోసం రకూల్ ని వాడుతున్నాడా..!

rakul

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏది చేసినా ఒక లాజిక్ ఉంటుంది. అతను అందుకే అంత టాప్ డైరెక్షర్ గా రాణించగలుగుతున్నాడు ఈ టాప్ డైరెక్షర్ కి ఒక సెంటిమెంట్ ఉంది ఇప్పుడు అదే సెంటిమెంట్ ఓ హీరోయిన్ పాలిట శాపం కాబోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన ఒక సెంటిమెంట్‌ని క్రమం.తప్పకుండా పాటిస్తూ వస్తున్నాడు. రిజల్ట్ ఎలా వచ్చినా దాన్ని మార్చుకోలేదు. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఇదే ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి పెద్ద గండంగా మారింది. అయినా ఆయన సెంటిమెంట్ ఈమెకి గండంగా మారడమేంటి? అదేంటో తెలుసుకుందాం !

పవర్ స్టార్ తో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నటీనటుల్ని సైతం ఎంపిక చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇందులో కథానాయికగా రకుల్‌ని తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు కూడా మొదలయ్యాయి.

త్రివిక్రమ్ కూడా చాలా వరకు మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు కాబట్టి.. దాదాపు ఆమెనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని చర్చలు మొదలయ్యాయి. పైగా.. ఇందులోని పాత్ర కూడా చాలా ప్రధానమైనదని, ‘నాన్నకు ప్రేమతో’లో రకుల్ పోషించిన క్యారెక్టర్‌ని ఇది పోలి ఉంటుందని, అందుకే ఆమెనే ఎంపిక చేయొచ్చని అభిప్రాయాలు మొదలయ్యాయి. బహుశా ఇది నిజమైతే అవ్వొచ్చేమో గానీ.. త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ని ఫాలో అయితే మాత్రం ఆమెకి ఛాన్స్ దక్కకపోవచ్చు.

Leave a comment