రకూల్ తెలుగింటి కోడలు కాబోతోందా ..?

rakul

స్లిమ్ బ్యూటీ రకూల్ ప్రేమలో ఉందా ..? ఆమె తెలుగు సినీ ఇండ్రస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోబోతోందా ..? అంటే అవుననే విధంగా ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఎక్కువగానే మాట్లాడుతోంది. నాకు అలాంటి అబ్బాయి కావాలి , ఇలాంటి అబ్బాయి కావలి అంటూ కండిషన్ లు పెడుతూ వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగింటి కోడలు అవుతానేమో అంటూ హింట్స్ ఇస్తోంది.

తనకు కాబోయే భర్త గురించి ఆమె మాటల్లో చూస్తే ..” తెలుగు సంప్రదాయానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని నా తోటి నటి అయిన సమంత లాగా కోడల్ని అవుతానేమో అని నవ్వుతూ, సిగ్గు పడుతూ చెప్తోంది. ఇంతవరకు ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదని, అసలు,ఇప్పటి వరకు అటువంటి పరిస్థితులు రాలేదని స్పష్టం చేసింది. తనకు పెళ్లి ఆల్లోచన ఇప్పట్లో లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కురాలిని కాదని, అయినా ఆ సమయం వచ్చినప్పుడే ఆ విషయం చెప్తాను అంటోంది.

ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది అని రకుల్ చెప్పుకొస్తోంది. నిజంగా సమాంత చాల లక్కీ గర్ల్ అంటూ మంచి భర్త మంచి కుటుంబం దొరికింది అంటూ సమాంత ని పొగిడేస్తోంది. ఈ మధ్య కాలంలో సమంత ఓ తెలుగు హీరోతో చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రకూల్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తుతోంది.

Leave a comment