Gossipsఆ హీరో అంటే నాకు పిచ్చి : రకూల్

ఆ హీరో అంటే నాకు పిచ్చి : రకూల్

టాలీవుడ్ లో బాలీవుడ్ భామలు ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి పేరు సంపాదించిన రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో ఈ హాట్ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ సంపాదించుకుంది.

ఈ మద్య రకూల్ కి తెలుగు లో పెద్దగా అవకాశాలు రావడంలేదు..దాంతో తమిళ బాట పట్టినా అక్కడ కూడా పెద్దగా ఛాన్సులు రాలేదు. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ సేఫ్ అనుకుంటున్న సమయంలో ఈ మద్య రిలీజ్ అయిన దేదే ప్యార్ దే తో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగాన్ తో నటించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీల మీకు అభిమాన హీరోలు ఎవరన్న ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది. యంగ్ ఎనర్జిటిక్ హీర రణ్ వీర్ సింగ్ అంటే తనకు పిచ్చని చెప్పింది.

ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ నటి దీపికా పదుకొనె ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్ వీర్ సింగ్ కి పెళ్లి కాకుండా వుంటే తాను చేసుకుని ఉండేదానినని చెప్పింది. అందేంటీ తన మనసులో ఇంత దాగుందా..పెళ్లైన వాడితో ఇలా మనుసు పడేసుకోవడం ఏంటా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news