రేష్మిఅందంతో రాజశేఖర్ కి పెట్టుబడి..

Rashmi Gautam

గుంటూరు టాకీస్ సినిమాని అంతా బూతు అన్నారు. కానీ ఈ సినిమా వ‌సూలు చేసిన క‌లెక్ష‌న్ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా పాతిక కోట్లు. పెట్టిన పెట్టుబడి చూస్తే కేవ‌లం రెండు కోట్లే! ఇదీ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు స‌త్తా! తన గత సినిమా రెండు కోట్ల రూపాయలతో తీస్తే పాతిక కోట్ల రూపాయలు వచ్చాయని, ఈ సారి పాతిక కోట్ల రూపాయల బడ్జెట్‌తో ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాను రూపొందించానని ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో అంచనా వేయవచ్చని ప్రవీణ్ సత్తారు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్, థియేట్రికల్ ట్రైలర్లు ఇప్పటికే విడుదల అయ్యాయి.ఇవ‌న్నీ ఇప్ప‌టికే నెటిజ‌న్స్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.లో బ‌డ్జెట్ సినిమాల‌కు కేరాఫ్ గా నిలుస్తూ హై రేంజ్ స‌క్సెస్ అందుకోవ‌డం త‌న‌కెంతో ఆనందంగా ఉంద‌ని చెప్పాడు ప్ర‌వీణ్ స‌త్తారు.

Leave a comment