Gossipsప‌వ‌ర్ స్టార్ పై ఫైర్ అయిన హీరో

ప‌వ‌ర్ స్టార్ పై ఫైర్ అయిన హీరో

మ‌ళ్లీ ఓ వివాదం
కొత్త వివాదం
పోలీస్ పాత్ర‌ల‌తో న‌టించి మెప్పించిన రాజ‌శేఖ‌ర్ మ‌రోమారు కొణెద‌ల కుటుంబాన్ని టార్గెట్ చేయ‌డం విశేషం.
గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఉద‌హ‌రిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మెగాభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి.
ఆ వివ‌రాలివిగో..
యాంగ్రీ యంగ్ మేన్ గా పేరున్న రాజ‌శేఖ‌ర్ మ‌రో సారి సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేశాడు. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ఓ సీన్‌ని ఉదాహ‌ర‌ణగా చూపు తూ తన వాద‌న‌ని బ‌ల‌ప‌ర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. “ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే… అందులో అన్నీ ఓకే, కానీ చివరిలో తిడుతూ డ్యాన్స్ చేయిస్తారు… ఆ తరువాత ఏం చేస్తిరి… ఏం చేస్తిరి.. ఏంటి అని, ఆలీ ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపించారు… ఏంట్రా… చూస్కో అన్నట్టు, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు, నన్ను తిట్టినట్టు చేశారు. నాకు అదే బాధ కలిగింది.గ‌తంలో పీఆర్పీకి సంబంధించి కొన్ని విష‌యాలు చెప్పాను అదే ఆయన కోపానికి కార‌ణం అయి ఉంటుంది. అదేవిధంగా90వ దశకంలో నేను నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతుంటే, నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు అణగదొక్కే ప్రయత్నం చేశార”ని అన్నాడు.ఇక‌తన కుమార్తె శివానీ సినీ రంగ ప్రవేశంపై కూడా రాజశేఖర్ వివరణ ఇచ్చాడు.”శివానీకి సినిమాల్లో నటించడమంటే ఇష్టం, తొలి సినిమా కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానని అన్నా డు. ఆ అమ్మాయికి కూడా నాలాంటి కోరికలే ఉన్నాయి. మంచి కథలు చేయాలి.కొన్ని కథలు వింటూ ఉంది. ఒకటి రెండు మేము కూడా అనుకుంటు న్నాం. కొన్ని నచ్చాయి. ఏది ఫస్ట్, ఏది సెకండ్, థర్డ్ అన్నది తెలియదు.ఈ విష‌య‌మై రెండు మూడు నెలల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది”అని అన్నాడు. ఇక ఈ మాట‌ల‌పై ప‌వ‌న్ కౌంట‌ర్ ఇస్తాడో ఇవ్వ‌డో అన్న‌ది సినీజీవులు ఆస‌క్తి ఎదురుచూస్తున్న ప‌రిణామం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news