Gossipsనాని పై రాజమౌళి ప్రేమాయణం..?

నాని పై రాజమౌళి ప్రేమాయణం..?

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. నాని నాచురల్ నటనతో సినిమా సెన్సేషనల్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆమోదంతో పాటుగా సెలబ్రిటీస్ మెప్పు కూడా పొందింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు జెర్సీ సినిమాపై ప్రశంసలు అందించారు. ముఖ్యంగా నాని నటనతో పాటుగా గౌతం తిన్ననూరి డైరక్షన్ గురించి ప్రస్థావించారు.

ఇక ఇప్పుడు రాజమౌళి రాజముద్ర కూడా జెర్సీకి పడింది. సినిమా చూసిన రాజమౌళి సినిమా అద్భుతంగా ఉందని.. హృదయాన్ని కదిలించేలా చేసిన దర్శకుడు గౌతం తిన్ననూరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఫైనల్ గా నాని బాబు లవ్ యూ అంతే.. అని రాజమౌళి ట్వీట్ చేయడం జరిగింది. రాజమౌళి ట్వీట్ తో జెర్సీ సినిమాపై ఇంకొంత క్రేజ్ ఏర్పడింది.

కొన్నాళ్లుగా బాగాలేని సినిమాలకు రాజమౌళి ట్వీట్ చేసి అబాసు పాలవుతున్న పేపథ్యంలో నాని జెర్సీ సినిమాపై ట్వీట్ చేసిన జక్కన్న నాని జెర్సీపై స్పెషల్ ట్వీట్ అందరిని ఆకట్టుకుంటుంది. నాని జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నటించాడని చెప్పడం కన్నా జీవించాడని చెప్పొచ్చు. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news