Gossipsరాజమౌళి బ్రాండ్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందా ?

రాజమౌళి బ్రాండ్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందా ?

ఓటమి ఎరుగని దర్శకుడిగా బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాడు. తను ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా తన దగ్గర అసిస్టెంట్ గా చేసిన వారు మాత్రం ఫెయిల్ అవుతూ వస్తున్నారు. రాజమౌళి బ్రాండ్ తో సినిమా అవకాశాలు తెచ్చుకున్నా రాజమౌళి పనితనం తమ సినిమాల్లో చూపించట్లేదు.

అందుకే రాజమౌళి శిష్యులు చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. అయితే రాబోతున్న ఏంజెల్ సినిమా మాత్రం రాజమౌళిని సంతోష పెడుతుందని అంటున్నారు. అదెలాగా అంటే రాజమౌళి శిష్యులలో ఒకరైన పళని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బాహుబలి సినిమాకు కూడా రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పళని దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్రయత్నం ఏంజెల్.

నాగ్ అశ్విన్, హెబ్భా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా అయినా హిట్ అయ్యి రాజమౌళిని సంతోష పరుస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news