రాజమౌళిపై దిల్ రాజు మెగా స్కెచ్..!

12

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మీద అందరి దృష్టి ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా టాలీవుడ్ సిని చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అంటున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందట.

ఇక ఈ సినిమాకు పోటీగా దిల్ రాజు మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత దిల్ రాజు చేయబోయే ఈ మల్టీస్టారర్ రాజమౌళిని ఢీ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు మల్టీస్టారర్ కూడా స్టార్ హీరోలతో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

దిల్ రాజు వేసిన ఈ మెగా మల్టీస్టారర్ స్కెచ్ రాజమౌళికి కాస్త డిస్టబెన్స్ గా తయారవనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట దిల్ రాజు. మరి రాజమౌళితో పోటీ పడే ధైర్యం చేయడం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పొచ్చు.

Leave a comment