28 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు..!

Rajinikanth with santosh sivan after 28 years

సూపర్ స్టార్ రజినికాంత్ మురుగదాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పేట తర్వాత రజిని చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో రజిని పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. దాదాపు పాతికేళ్ల తర్వాత రజినిని పోలీస్ గా చూడబోతున్నాం. అయితే ఈ సినిమాకు కెమెరా మెన్ గా సంతోష్ శివన్ ను సెలెక్ట్ చేశారు. రజిని, సంతోష్ శివన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా దళపతి. ఆ సినిమా తర్వాత మళ్లీ 28 ఏళ్లకు రజిని సినిమా చేస్తున్నాడు సంతోష్ శివన్.

ఈ సినిమా గురించి చెబుతూ రజిని సార్ తో ఇన్నేళ్ల తర్వాత చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహేష్ స్పైడర్ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రజిని, సంతోష్ శివన్ కాంబినేషన్ లో మురుగదాస్ డైరక్షన్ లో సినిమా అంటే ఇక ఆ సినిమా అంచనాలు భారీగా ఉంటాయి. ఫైనల్ గా 28 ఏళ్ల తర్వాత రజిని, సంతోష్ శివన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు వస్తున్నారు. మరి ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.

మురుగదాస్ విజయ్ తో సర్కార్ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ సినిమాలో నటించిన కీర్తి సురేష్ ను ఈ సినిమాలో తీసుకున్నారు. రజినితో కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

Leave a comment