Videosకాలా" చిట్టెమ్మ" ఫుల్ వీడియో సాంగ్.. రజిని స్టైల్ కు ఫిదా..!

కాలా” చిట్టెమ్మ” ఫుల్ వీడియో సాంగ్.. రజిని స్టైల్ కు ఫిదా..!

సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన కాలా సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో రజిని స్టైల్ కు మాత్రం అందరు ఫిదా అవుతున్నారు. ఇక సినిమా నిన్న వచ్చిందో లేదో సినిమాలోని చిట్టమ్మా సాంగ్ ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.

ఆ పాటలో రజినితో పాటుగా హ్యూమా ఖురేషి కూడా కనిపిస్తుంది. మంచి మెలోడీ సాంగ్ గా అనిపిస్తున్న ఈ చిట్టమ్మ సాంగ్ లో రజిని లుక్ బాగుంది. సినిమా కథను నడిపించంతో పాటుగా ప్రేయసి మీద తన ప్రేమను చూపించేలా చిట్టెమ్మ సాంగ్ ఉంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సినిమాకు ఆకర్షణ అని చెప్పొచ్చు.

ముఖ్యంగా సినిమాలో సంతోష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. తెలుగులో టాక్ ఎలా ఉన్నా కాలా సినిమా తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరి కలక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news