Newsఇండియన్ యూట్యూబ్ స్టార్‌గా టాపు లేపిన రజనీకాంత్!!

ఇండియన్ యూట్యూబ్ స్టార్‌గా టాపు లేపిన రజనీకాంత్!!

Rajinikanth creates another record in YouTube by standing as the top trending teaser of his movie Kabali for the year 2016 in India. Kabali Teaser was the most viewed by Indians in this year.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రికార్డులు క్రియేట్ చేయడం కొత్తేమీ కాదు. అతడి సినిమాలు సృష్టించే ప్రభంజనం ముందు రికార్డులు వాటంతట అవే వచ్చి పడుతుంటాయి. కానీ రజనీకాంత్ నటించిన ఓ ఫ్లాప్ సినిమా కూడా రజనీకాంత్‌కు రికార్డుల మోత తెప్పించింది. తాజాగా యూట్యూబ్ వారు నిర్వహించిన ఓ సర్వేలో 2016 సంవత్సరానికి గాను యూట్యూబ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు మన తలైవా. కబాలి చిత్ర టీజర్‌ను ఈ ఏడాదిలో ఎక్కవ మంది చూసినట్లు యూట్యూబ్ స్పష్టం చేసింది. ఈ సంవత్సరంలో అత్యధికంగా ట్రెండ్ అయ్యింది కబాలి టీజర్. రజనీకాంత్ స్టైల్, కబాలి సినిమాపై క్రేజ్‌తో పాటు అదిరిపోయే విధంగా టీజర్ ఉండటంతో ఈ టీజర్‌ను చూసి ఊగిపోయారు జనం.

కబాలి చిత్రం విడుదలకు ముందు, రిలీజ్ అయిన ఈ టీజర్‌తో ఇండియా మొత్తం కబాలి మేనియాలో మునిగిపోయింది. కేవలం రజనీకాంత్ నడిచుకుంటూ వచ్చిన ఈ టీజర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ కలిపి కబాలి టీజర్‌ను యూట్యూబ్‌లో మొదటిస్థానంలో నిలబెట్టాయి. సినిమా విడుదల తరువాత ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినా.. కబాలీ టీజర్‌కు మాత్రం జనాలు బ్రహ్మరధం పట్టారు. యూట్యూబ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 2016 వ సంవత్సరానికి గాను యూట్యూబ్ లో అత్యధికంగా ట్రెండ్ అయిన ట్రైలర్లలో ‘కబాలి’ ట్రైలర్ మొదటి స్థానంలో ఉండగా దాని తరువాత కపిల్ శర్మ, సల్మాన్ ఖాన్‌ల కామెడీ షో లు ఉన్నాయి. మరి రజనీ మేనియా ముందు ఇలాంటి రికార్డులు కోకొల్లలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news