Gossipsరజిని కొత్త మూవీ 'పెట్ట' పిక్స్ లీక్.. ముత్తుని గుర్తుచేస్తున్న సూపర్...

రజిని కొత్త మూవీ ‘పెట్ట’ పిక్స్ లీక్.. ముత్తుని గుర్తుచేస్తున్న సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ రజినికాంత్ కాలా తర్వాత కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో చేస్తున్న సినిమా పెట్ట. ఈమధ్యనే మోషన్ పోస్టర్ తో అలరించిన రజినికాంత్ పెట్ట సినిమా నుండి లేటెస్ట్ గా ఆన్ షూట్ లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. ఈ పిక్స్ లీకవడం పట్ల చిత్ర దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు. అయితే రజిని ఫ్యాన్స్ మాత్రం సినిమాలో రజినికాంత్ స్టైలిష్ లుక్ చూసి షాక్ అవుతున్నారు.
1
రెడ్ కలర్ షర్ట్.. మెడలో బ్లూ కలర్ స్కార్ఫ్ తో ఉన్న రజిని స్టైలిష్ పిక్స్ లీక్ అయ్యాయి. రజిని గడ్డంతో కనిపించడం కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ముత్తు నాటి రజినిని గుర్తు చేసుకుంటున్నారు. స్టైలిష్ లో రజినికాంత్ ను మించిన వారు లేరని చెప్పొచ్చు. ఆయన స్టైల్ కే ఫ్యాన్స్ ఫిదా అవుతారు.

ఇక ఓ పక్క రజిని శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ సినిమా టీజర్ కూడా ఈ నెల 13న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. రోబో సీక్వల్ గా వస్తున్న ఆ సినిమా మీద కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఆ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news