రజినికాంత్ ” పెటా ” టీజర్..ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్..

55

సౌత్ లోనే కాదు దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో సూపర్ స్టార్ రజినికాంత్ ఒకరు. దేశ విదేశాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారని తెలిసిందే. ఈరోజు 68 వసంతాలను పూర్తి చేసుకుని 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు రజినికాంత్. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం చేస్తున్న పెటా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ పేటా మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సినిమా టీజర్ లో రజిని స్టైల్ కు ఎక్కువ ప్రాధ్యాత ఇస్తున్నట్టు తెలుస్తుంది. అలా రజిని నడిచి వచ్చే వీడియో రజిని ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
2
పెట్టలో రజిని మరోసారి డాన్ గా కనిపిస్తాడని అంటున్నారు. భాషా సినిమా తర్వాత రజిని చాలా సినిమాల్లో డాన్ గా నటించారు. అంతెందుకు ఈమధ్య వచ్చిన కబాలిలో కూడా డాన్ గా మెప్పించారు రజిని. అయితే పేటకు భాషాకు పోలిక ఉంటుందట. కచ్చితంగా రజిని ఫ్యాన్స్ ఆకలి తీర్చే అసలు సిసలు సినిమా ఇది అవుతుందని అంటున్నారు. పేటా మూవీ టీజర్ చూస్తే అది నిజమే అనక తప్పదు. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఉంటుందా లేదా అన్న దాని మీద క్లారిటీ రాలేదు.
3
2019 సంక్రాంతి రిలీజ్ లో ఓ పక్క చరణ్ వినయ విధేయ రామ, మరో పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు వస్తున్నాయి. ఈ రెండిటితో పాటుగా దిల్ రాజు బ్యానర్ లో ఎఫ్-2 కూడా సంక్రాంతి టార్గెట్ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఆ సినిమాలో నటిస్తుండటం విశేషం. మరి ఇంత భారీ పోటీలో రజిని వచ్చి అలరిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. 2.ఓ తెలుగు రెండు రాష్ట్రాల్లో 72 కోట్లకు కొన్నారు. ఇప్పటివరకు 50 కోట్ల దాకా రాబట్టిందని తెలుస్తుంది. అయితే నైజాం లో మాత్రం 2.ఓ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చింది.

Leave a comment