పవర్ స్టార్ ని అనుకరించిన రాజశేఖర్ .. షాకింగ్ విమర్శలు !!

pawan kalyan rajasekhar

Rajasekhar Imitates Pawan Kalyan in an interview and says that Pawan has no manners to treat others. How Can he run a Political Party asks Jeevitha Rajasekhar.

సాధారణంగా చాలా సినిమాల్లో హీరో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తుంటారు ఆర్టిస్టులు. కామెడీ పండించడం కోసమో, తమ సినిమాలో ఆ ఇమిటేషన్ సీన్ బాగా పనికొస్తుందనే నమ్మకమో తెలీదు కానీ రాజశేఖర్‌ను మాత్రం టాలీవుడ్‌లో వాడుకోని హీరో అంటూ ఎవరూ లేకపోలేదు. అయితే ఇలాంటి రాజశేఖర్ ఎప్పుడూ కూడా తనను ఇమిటేట్ చేసిన వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అందులో ఎవరు ఎవర్ని ఇమిటేట్ చేసారో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు.

పవన్ కళ్యాణ్‌కు గబ్బర్‌సింగ్ కమ్‌బ్యాక్ మూవీగా నిలచి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫేమస్ అయిన అంత్యాక్షరి సీన్ జనాలను కడుపుబ్బా నవ్వించింది. అయితే ఇందులో రాజశేఖర్ పాటకు ఓ కమెడియన్ అచ్చం రాజశేఖర్‌లా ఇమిటేట్ చేయడంతో పవన్ కూడా రాజశేఖర్ మాట్లాడే విధంగా పంచ్ వేస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. జీవితా-రాజశేఖర్ దంపతులు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తమను పవన్ కళ్యాణ్ ట్రీట్ చేసిన విధానంపై జీవితా రాజశేఖర్ మండిపడ్డారు. ఇక రాజశేఖర్ అయితే ఏకంగా పవన్ ప్రవర్తన ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఓ సారి ఆ వీడియోను మీరూ చూడండీ..

Leave a comment