డియో డియో.. అంటానంటున్న ముదురు హీరో

Rajasekhar Clarity On Garudavega Sequel

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ ఇటీవల రెండో ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేశాడు. గరుడవేగ చిత్రంతో తన ఖాతాలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ యాంగ్రీ స్టార్ హీరో ఇప్పుడు కల్కి అనే కొత్త సినిమాతో మనముందుకు రానున్నాడు. టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు చిత్ర యూనిట్. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజశేఖర్ ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రివీల్ చేశాడు.

రాజశేఖర్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన గరుడవేగ చిత్రం తన కెరీర్‌లో మరిచిపోలేని చిత్రమని అన్నాడు. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను త్వరలో ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే ఈ మూవీ కోసం స్క్రిప్ట్‌ పని మొదలుపెట్టినట్లు రాజశేఖర్ తెలిపారు. అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన కల్కి సినిమా ఆడియెన్స్‌ను ఖచ్చితంగా మెప్పిస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేసినట్లు హీరో తెలిపాడు.

ఏదేమైనా తనకు బూస్ట్ ఇచ్చిన గరుడవేగ చిత్ర సీక్వెల్‌తో ఆడియెన్స్‌ను మరోసారి ఆకట్టుకునేందుకు రాజశేఖర్ రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి స్టోరీలైన్‌తో వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు సినీ జనాలు.

Leave a comment