Gossipsఎన్టీఆర్, చరణ్ సినిమా కథ తెలిసింది.. ఇద్దరికిద్దరు రెచ్చిపోవడం ఖాయం..!

ఎన్టీఆర్, చరణ్ సినిమా కథ తెలిసింది.. ఇద్దరికిద్దరు రెచ్చిపోవడం ఖాయం..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టార్ మూవీ రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు సినిమా బడ్జెట్ 200 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలుస్తుంది.

అంతేకాదు ఎన్.టి.ఆర్ గ్యాంగ్ స్టర్ గా.. చరణ్ పోలీస్ గా కనిపిస్తారట. ఇక ఈ వార్తలు బయటకు రాగానే ఈ సినిమా కథ హాలీవుడ్ సినిమా అమెరికన్ గ్యాంగ్ స్టర్ సినిమాకు పోలిక పెడుతున్నారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు కుటుంబంలో విభేధాల కారణంగా ఒకరు గ్యాంగ్ స్టర్ గా.. మరొకరు పోలీస్ గా మారుతారట.

సినిమాలో ఎన్.టి.ఆర్ అన్నగా.. చరణ్ తమ్ముడిగా నటిస్తున్నాడని అంటున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కథ వింటుంటే ఆయా పాత్రల్లో ఇద్దరుకిద్దరు రెచ్చిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news