GossipsRRRలో మార్పుకు జడుసుకున్న జక్కన్న

RRRలో మార్పుకు జడుసుకున్న జక్కన్న

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం యావత్ సినీ లోకం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం.. తారక్, రామ్ చరణ్ లాంటి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అంచనాలు పీక్స్‌కు చేరాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ల విషయం మాత్రం రాజమౌళికి పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఇప్పటికే శ్రద్ధా కపూర్, బ్రిటిష్ భామ డైసీ ఎడ్జర్ జోన్స్‌ పేర్లను జక్కన్న ఫిక్స్ చేశారు.

కానీ.. తెలుగు సినిమాలో ఫారిన్ బ్యూటీ ఏమిటి అంటూ కొంతమంది విమర్శకులు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. చరణ్ సరసన శ్రద్ధా కపూర్ ఓకే.. కానీ తారక్ లాంటి పవర్‌ఫుల్ యాక్టర్ పక్కన ఫారిన్ బ్యూటీ సెట్ కాదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అటు అభిమానులు కూడా తమ హీరో పక్కన బ్రిటిష్ బ్యూటీ వద్దంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజమౌళికి తలనొప్పి మళ్లీ మొదలైంది. అయితే తారక్ సరసన యాక్ట్ చేసేందుకు కొంత మంది స్టార్ బ్యూటీలను లైన్‌లో పెట్టారు చిత్ర యూనిట్. కానీ నార్త్ బ్యూటీలు కళ్లుచెదిరే పేమెంట్ అడుగుతుండటంతో చిత్ర నిర్మాతలు డైలమాలో పడ్డారు. ఈ యవ్వారం మొత్తం రాజమౌళికి అస్సలు నచ్చట్లేదు.

దీంతో తన సినిమాలో తారక్ సరసన ఇండియన్ బ్యూటీలకు ఛాన్స్ లేదేమో అంటూ.. ఫారిన్ బ్యూటీ అయితే ఆ పాత్రకు సరైన న్యాయం చేస్తుందని జక్కన్న అంటున్నాడు. మరి తారక్ పక్కన ఫారిన్ బ్యూటీయే ఉంటుందా.. లేక ఇండియన్ బ్యూటీ ఎవరైనా చోటు దక్కించుకుంటుందా అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో జక్కన్నకు మాత్రం తలనొప్పి తగ్గడం లేదు. మరి ఆయన తలనొప్పిని దూరం చేసే అమృతాంజన్ బామ్‌ను ఏ హీరోయిన్ తెస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news