Movies‘రాజా ది గ్రేట్’ పోస్టర్ టాక్ : ఈ మహారాజా కాస్త...

‘రాజా ది గ్రేట్’ పోస్టర్ టాక్ : ఈ మహారాజా కాస్త డిఫరెంట్

Mass Maharaja Ravi Teja latest movie Raja The Great title logo launched on the vacation of Republic Day. Director Anil Ravipudi handling this project under Dil Raju productions. Mehrene Kaur Peerzada playing female lead role in this film.

గతేడాది ఒక్క సినిమా కూడా చేయని మాస్ మహారాజా రవితేజ.. ఈ సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ఆడియెన్స్‌కు వినోదం పంచేందుకు రెడీ అవుతున్నాడు. గణతంత్ర దినోత్సవం, రవితేజ పుట్టినరోజు సందర్భంగా రెండు చిత్రాల యూనిట్‌లు అధికారికంగా పోస్టర్లు విడుదల చేశాయి. అందులో ‘టచ్ చేసి చూడు’ సినిమా పోస్టర్లు ఒకరోజు ముందే రిలీజ్ అవ్వగా.. తాజాగా ‘రాజా ది గ్రేట్’ మూవీ యూనిట్ టైటిల్ లోగోని విడుదల చేసింది.

‘పటాస్, సుప్రీం’ హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ‘కిక్’ తరహాలో ఉంటుందని, ఇందులో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఆడియెన్స్ రవితేజ నుండి ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌నే కోరుకుంటారు కాబట్టి.. అలాంటి అంశాలతోనే కథని రెడీ చేశాడట. అలాగే.. రవితేజ పాత్రని కూడా కాస్త భిన్నంగా ఉండేలా అనిల్ డిజైన్ చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో రవితేజ సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఫేమ్ మెహ్రీన్ కౌర్ పీర్‌జదా కథనాయికగా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news