Moviesరాజుగాడు ట్రైలర్.. రాజ్ తరుణ్ ఫేట్ మారేనా..!

రాజుగాడు ట్రైలర్.. రాజ్ తరుణ్ ఫేట్ మారేనా..!

యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజుగాడు. తనకు తెలియకుండానే దొంగతనం చేసే రాజుగాడు హీరోయిన్ ను చూడగానే అన్ని వదిలేస్తాడు. ఇక ఆకలయ్యి దొంగతనం చేస్తే తన నరికే ఫ్యామిలీలో అలవోకగా దొంగతనాలు చేసే రాజుగాడు ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నదే ఈ సినిమా కథ.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. ట్రైలర్ చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. సినిమా కూడా ఫన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

కుమారి 21ఎఫ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం కెరియర్ లో వెనుకపడ్డాడు. మరి ఈ రాజుగాడు అయినా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. రాజేంద్ర ప్రసాద్ కూడా తండ్రి పాత్రలో కామెడీ పండించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ అయితే కొత్తగా లేకున్నా ఎంటర్టైన్ చేసింది. సినిమా కూడా ఇలానే ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూడాలి. అక్కడక్కడ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లా అనిపిస్తున్న ఈ రాజుగాడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news