Gossipsఏజ్ బార్ బ్యూటీతో యువ హీరో ప్రేమ..!

ఏజ్ బార్ బ్యూటీతో యువ హీరో ప్రేమ..!

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత కుమారి 21ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. యువ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటి ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ఇక కొన్నాళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన రాజ్ తరుణ్ త్వరలో ఆమె ఎవరో రివీల్ చేస్తాడట.

అయితే మరో పక్క రాజ్ తరుణ్ ఓ ఏజ్ బార్ హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తాడట. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని తెలుస్తుంది. గుండెజారి గల్లతయ్యిందే, ఒకలైలా కోసం సినిమాలతో అలరించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ ఈసారి రాజ్ తరుణ్ తో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో తన కన్నా వయసులో పెద్ద అమ్మాయిని హీరో ప్రేమిస్తాడట. ఇలాంటి కథలను అటెంప్ట్ చేయాలంటే చాలా అనుభవం కావాలి.

రాజ్ తరుణ్ హీరోగా విజయ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా క్రేజీగా మారనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా ఓ సీనియర్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news