మల్టీస్టారర్ క్లాప్ డేట్ కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

multi starer movie details

బాహుబలి తర్వాత దాన్ని తలదన్నే సినిమా తీయాలన్న అభిమానుల కోరికను నిజం చేసేలా మెగా నందమూరి క్రేజీ మల్టీస్టారర్ షురూ చేశాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ మొదటిసారి కలిసి పనిచేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ నుండి మొదలుపెట్టబోతున్నాడట. స్పెషల్ గా అక్టోబర్ ఎందుకంటే అది రాజమౌళి పుట్టిన నెల అని తెలుస్తుంది.

2018 అక్టోబర్ లో మెగా నందమూరి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు కాబట్టి ఆరోజే సినిమా సెట్స్ కు వెళ్తుందని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న జక్కన్న త్వరలోనే అది ఫినిష్ చేసి షెడ్యూల్ ప్లాన్ చేస్తారని అంటున్నారు. 2019 సమ్మర్ కల్లా సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం రాం చరణ్ రంగస్థలం సినిమా ఫినిష్ చేసి బోయపాటి సినిమా చేయబోతున్నాడు. తారక్ కూడా త్రివిక్రం సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఇద్దరు హీరోల సినిమాలు సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తే అక్టోబర్ నుండి రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తాడట. ఇక ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ సంక్రాంతికి ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెళ్లడిస్తారట.

Leave a comment