Gossipsశ్రీహరి తనయుడి " రాజ్ దూత్ " రివ్యూ...

శ్రీహరి తనయుడి ” రాజ్ దూత్ ” రివ్యూ & రేటింగ్..

రియల్ స్టార్ శ్రీహరి తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్ శ్రీహరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీహరితో కలిసి నటించిన మేఘాంశ్ శ్రీహరి హీరోగా మొదటి ప్రయత్నంగా రాజ్ దూత్ సినిమా చేశాడు. అర్జున్ కార్తిక్ దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మించారు. జూలై 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వారం వాయిదా వేసుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సంజయ్ అలియాస్ సంజు (మేఘాంశ్) మొదటి చూపులోనే ప్రియ (నక్షత్ర)ని ప్రేమిస్తాడు.ప్రియను పెళ్లి చేసుకోవాలని అనుకున్న సంజు ఆమె తండ్రి (అనీష్ కురువిళ్ల) దగ్గరకు వెళ్తాడు. మొదట సంజుని దూరం పెట్టినా ప్రియ ఫాదర్ తర్వాత అతనికి ఓ టాస్క్ ఇస్తాడు. ప్రియ తాతకి రాజ్ దూత్ బైక్ చాలా ఇష్టమని అది తెచ్చి ఇస్తే మీ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలుపనని అంటాడు ప్రియ తండ్రి. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం రాజ్ దూత్ వేటలో పడతాడు సంజు. ఇంతకీ రాజ్ దూత్ కు ప్రియా ఫ్యామిలీకి ఉన్న లింక్ ఏంటి..? రాజ్ దూత్ ను వెతికే ప్రయత్నంలో సంజు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? ఫైనల్ రా సంజు, ప్రియలు కలిశారా అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

మొదటి సినిమా అయినా హీరోగా మేఘాంశ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అయితే డ్యాన్స్, ఫైట్స్ ఓకే ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త పరిణితి సాధించాల్సి ఉంది. హీరోయిన్ నక్షత్ర సోసోగానే ఉంది. హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉన్నా వాళ్లకు తగినంత ప్రాధాన్యత అయితే ఇవ్వలేదు. కమెడియన్ సుదర్శన్ కొన్ని పంచులు పేలాయి. కామెడీ కూడా సోసోగా అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు :

వరుణ్ సునీల్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. అయితే సాంగ్స్ అంత క్యాచీగా అనిపించవు.. బిజిఎం ఇంప్రెస్ ఓకే అనిపిస్తుంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. అర్జున్ కార్తిక్ డైరక్షన్ బాగానే ఉంది. కథ జస్ట్ ఓకే అనిపించగా కథనంలో వాళ్లు మెప్పించలేకపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా అనిపించలేదు.

విశ్లేషణ :

రియల్ స్టార్ శ్రీహరి తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మేఘాంశ్ మొదటి సినిమానే ఓ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ తో వచ్చాడు. అర్జున్, కారిక్ దర్శక ద్వయం తెరకెక్కించ్న రాజ్ దూత్ కథ, కథనాల్లో గొప్పగా ఏం లేదు. అక్కడక్కడ కొంత కామెడీ బెటర్ గా అనిపించినా సినిమాలో దమ్ము లేకపోవడంతో నిరాశ పరుస్తుంది.

సినిమా మొత్తం రాజ్ దూత్ బైక్ మీదే నడుస్తుంది. కథ కొద్దిగా బెటర్ గా అనిపించినా కథనంలో దర్శకుడు పట్టు కోల్పోయాడు. సినిమా జనరంజకంగా మార్చడంలో విఫలమయ్యాడు. మేఘాంశ్ తొలి సినిమా కాబట్టి ప్రయత్నం మెప్పించేలా ఉన్నా సక్సెస్ ఫుల్ సినిమాగా మాత్రం రాజ్ దూత్ అనిపించుకోలేదు.

ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగించిన రాజ్ దూత్ సినిమా యూత్ ఆడియెన్స్ కు నచ్చొచ్చు. శ్రీహరి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సినిమా అవుట్ పుట్ ఎలా ఉన్నా డెబ్యూ మూవీగా మేఘాంశ్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు.

ప్లస్ పాయింట్స్ :

మేఘాంశ్

సినిమాటోగ్రఫీ

కామెడీ

మైనస్ పాయింట్స్ :

స్టోరీ, స్క్రీన్ ప్లే

ప్రొడక్షన్ వాల్యూస్

బాటం లైన్ :

రాజ్ దూత్.. మేఘాంశ్ ఫస్ట్ రైడ్ మెప్పించలేదు..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news