గూగుల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్..! ఎందుకంత మోజు…!

radhika-kumaraswami-trends-in-google

ప్రస్తుత కర్ణాటక రాజకీయాల మీద అందరి దృష్టి ఎంత ఆసక్తిగా ఉందో తెలిసిందే. బిజెపి అభ్యర్ధి యడ్యూరప్ప బల పరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో జెడిఎస్, కాంగ్రెస్ శ్రేణులు పండుగ చేసుకున్నారు. ఇక ఈ క్రమంలో కర్ణాటక తర్వాత సిఎం కచ్చితంగా జెడిఎస్ అధినేత కుమారస్వామినే అని అంటున్నారు. కాంగ్రెస్ కూడా కుమారస్వామిని సిఎం చేసేందుకు సుముఖంగా ఉందని తెలుస్తుంది.

ఒక్కసారిగా దేశం మొత్తం కుమారస్వామి పేరు మారుమోగింది. అయితే కుమారస్వామి గురించి తెలుసుకునే క్రమంలో అతని భార్య రాధిక గురించి కూడా అందరు వెతకడం మొదలుపెట్టారు. కుమారస్వామి రెండవ భార్య అయిన రాధిక ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని మొత్తం 31 సినిమాల్లో ఆమె నటించినట్టు తెలుస్తుంది.

కుమారస్వామి భార్యగా రాధికకు ప్రత్యేక క్రేజ్ వచ్చింది. అయితే కుమారస్వామితో పాటుగా రాధిక కుమారస్వామి గురించి కూడా వెతుకుతున్నారు నెటిజెన్లు. ఏ రేంజు లో అంటే గూగుల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్ లో ఉండేలా సెర్చ్ చేస్తున్నారన్నమాట. గూగుల్ ట్రెండ్స్ లో భారత్ సెర్చ్ ఇంజిన్ 100 పాయింట్స్ ఇస్తే.. అది ఎక్కువ వెతుకుతున్న పదమని పరిగణలో తీసుకుంటారు.రాధికా గురించి ఖతర్ లో 36 పాయింట్లు, యూఏఈలో 22, శ్రీలంకలో 19, కువైట్ లో 18 పాయింట్లతో ఆమెను వెతకడం జరిగింది. మే 13 నుండి 19 వరకు రాధికా కుమారస్వామి గూగుల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు రాధికా కుమారస్వామి.

Leave a comment