అఖిల్ – నాని మధ్యలో శిరీష్ ! ట్విస్ట్ అదిరింది

nani and akhil

ఏంటో ఈ సినిమాల ఈ సినిమాల గోల ! టాప్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి బరిలో ఉంటే చిన్న సినిమా హీరోల సినిమాలన్నీ ఒక నెల ముందే అంటే డిసెంబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ నెలలో నాని, అఖిల్, మధ్య పోటీ ఉందనుకుంటుండగా వీరిద్దరి మధ్యలోకి అల్లువారి అబ్బాయి శిరీష్ వచ్చి చేరాడు. దీంతో త్రిముఖ పోరు తప్పేటట్లు లేదు.

నాని నటిస్తున్న ”ఎంసీఏ” సినిమాను వారం ముందే విడుదల చేసే అవకాశాలున్నాయంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. మొత్తమ్మీద వారం రోజుల గ్యాప్ లో అయినా పోటీ తప్పదని అంతా భావిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వీళ్లిద్దరి మధ్యలో పోటీకి మరో హీరో దిగాడు. అతడే మెగా హీరో అల్లు శిరీష్.

అఖిల్ నటిస్తున్న ”హలో” సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. నాని నటిస్తున్న ”ఎంసీఏ” సినిమాను వారం ముందే విడుదల చేసే అవకాశాలున్నాయంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీగా అల్లు శిరీస్ కూడా తన కొత్త సినిమా ”ఒక్క క్షణం” ను సిద్ధం చేశాడు. ఈ మూవీని డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు అల్లు శిరీష్.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్’గా ‘ఒక్కక్షణం’ తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా నాని, అఖిల్ సినిమాల మధ్య రిలీజ్ చేయబోతున్నారు. మరీ. శిరీష్ వీరిద్దరి ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా మారింది.

Leave a comment