Moviesనాపై కొన్ని వెబ్‌సైట్లు చాలా తప్పుగా రాశాయి : బాధ వెళ్లగక్కిన...

నాపై కొన్ని వెబ్‌సైట్లు చాలా తప్పుగా రాశాయి : బాధ వెళ్లగక్కిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

Finally, 30 years industry prudhvi opens up on Khaidi no 150 role rumours. He said some websites changes his comments and wrote false stories.

ఓ చిన్న గాలి వీస్తే చాలు.. దాన్ని చిలికి చిలికి గాలివానలా మార్చేస్తాయి కొన్ని వెబ్‌సైట్లు. క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా పుంఖానుపుంఖాలుగా రూమర్లు క్రియేట్ చేసి పడేస్తారు. అవి ఇతరులను బాధిస్తాయా? లేదా? అన్నది పట్టించుకోరు.. తమకు ఉపయోగపడిందా? లేదా? అన్నది ఆలోచిస్తారు. అయితే.. ఇలాంటి దూకుడు ప్రదర్శించిన ప్రతిసారి వివాదాలు రాజుకోవడమో, ఆయా సెలబ్రిటీలు ఆ వెబ్‌సైట్స్‌పై మండిపడడమో జరుగుతుంది. ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వంతు వచ్చింది. తనపై ఓ రూమర్ క్రియేట్ చేసి, దాన్ని ప్రచారం చేసినందుకు.. ఈ కమెడియన్ వాటిపై ఫైర్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కమెడీయన్ పృధ్వీ పాత్రను తగ్గించారని, అది తెలిసి అతను యూనిట్‌పై మండిపడ్డాడని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. ‘ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించడం నా అదృష్ణం. కానీ.. కొన్ని సీన్లను తొలగించడం దురదృష్టం. సంక్రాంతి రోజున నా తల్లి చనిపోయినంత బాధగా ఉంది’ అని పృథ్వీ అన్నట్లుగా వెబ్‌సైట్స్ రాశాయి. ఇది వాస్తవమేననుకుని.. అందరూ ఖంగుతిన్నారు. పృథ్వీ ఇలాంటి కామెంట్స్ చేశాడా? అని ఇండస్ట్రీలో గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఈ వార్తలు అటు ఇటు చక్కర్లు కొడుతూ.. చివరికి పృథ్వీ చెవిన పడ్డాయి. దీంతో.. అతను ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు.

చిరు సినిమాలో తన పాత్రను తగ్గించారన్నది అవాస్వతమని పృథ్వీ స్పష్టం చేశాడు. ఆ సినిమాలో తాను నటించింది ఒక్కరోజు మాత్రమేనని తెలిపాడు. కొన్ని వెబ్‌‌సైట్లు తాను చెప్పిన మాటలను వక్రీకరించాయని, చిరంజీవితో కలిసి నటించడమే తన అదృష్టంగా భావిస్తున్నానని పృథ్వీ అన్నాడు. ఆయా వెబ్‌సైట్స్ తనపై ఇలాంటి వార్తలు రాయడం బాధగా ఉందని పేర్కొన్నాడు. కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11న ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news