దిల్ రాజుకు షాకుల మీద షాకులు…ఇప్పట్లో కోలుకోలేడేమో….!

producer dil raju loss as distributor

ఈ ఇయర్ నిర్మాతగా దిల్ రాజు వరుస నాలుగు హిట్లు అందుకుని సూపర్ ఫాంలో ఉన్నాడు. భార్య అనిత మరణం దిల్ రాజుకి విషాదాన్ని మిగిల్చినా ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. ఇక సినిమాల సక్సెస్ లు అవడంతో కాస్త కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. నిర్మాతగా సక్సెస్ అవుతున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఎప్పుడు లేనిది షాకుల మీద షాకులు తింటున్నాడు.

అదెలా అంటే ఈమధ్యనే వచ్చిన ఓ రెండు సినిమాల వల్లా దిల్ రాజు భారీ మొత్తం లాస్ అయ్యాడని తెలుస్తుంది. అందులో ఒక సినిమా గౌతం నంద. గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతగా ప్రేక్షకులకూ రీచ్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసి కొనేసిన దిల్ రాజుకి 4 కోట్ల దాకా నష్టం వస్తుందట. ఇక మరో పక్క సుకుమార్ నిర్మాణంలో వచ్చిన దర్శకుడు కూడా ఘోరంగా పోయింది.

మొదటి రోజు మొదటి షో నుండి ఆ సినిమా చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సుకుమార్ నిర్మాతగా చేసిన మొదటి ప్రయత్నం కుమారి 21ఎఫ్ సక్సెస్ అవడం వల్ల అతని మీద నమ్మకంతో దర్శకుడు కొనేశాడు దిల్ రాజు. కాని చూస్తే అతనికి ఇది కూడా నష్టాలు తెచ్చిపెట్టేలా ఉందట. సో అలా తాను నిర్మించిన సినిమాల కన్నా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఫెయిల్ అయ్యాడని తెలుస్తుంది.

Leave a comment