Gossipsబాలీవుడ్ నుండి ప్రియాంక ఒక్కరే

బాలీవుడ్ నుండి ప్రియాంక ఒక్కరే

వివాదంలో పింకీ చోప్స్

ఫోర్బ్స్ జాబితాలో చోటుద‌క్కించుకోవ‌డం చిన్న విష‌యం కాదు

అదీ ఐదు భార‌తీయ మ‌హిళ‌ల‌లో ఒక‌రుగా ఉండ‌డం అంటే ఇంకా సామాన్యమైన అంశం కాదు

అయినా ఇదంతా ఒక్క‌రోజులో వ‌చ్చిందా లేదు క‌దా!! అంటోంది పింకీ చోప్స్‌..

వివ‌రాలిలా :: ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగి, ఆపై అమెరికా టెలివిజ‌న్ సిరీస్‌లో అవ‌కాశం ద‌క్కించుకుని ఏకంగా హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తాజాగా ప్రియాంక మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద మంది ప్ర‌తిభావంతులైన మ‌హిళ‌ల జాబితాలో 97వ స్థానం ద‌క్కించుకుంది.ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన ఈ జాబితాలో కేవ‌లం ఐదుగురు భార‌తీయ మహిళ‌ల‌కే స్థానం ల‌భించింది. బాలీవుడ్ నుంచి చోటు ద‌క్కించుకున్న‌ది ప్రియాంక మాత్ర‌మే.

Priyanka Chopra

ఈ సంద‌ర్భంగా ప్రియాంక స్పందించింది. `కొన్ని రోజులుగా నన్ను కొంత మంది విమ‌ర్శ‌ల‌తో వేధిస్తున్నారు. నా వ‌స్త్ర‌ధార‌ణ‌తో వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రధానిని క‌లిసే అరుదైన అవ‌కాశం వ‌చ్చినందుకు ఆనందిస్తున్న స‌మ‌యంలో, నాపై దుష్ర్ప‌చారం చేశారు. ఇంకా న‌న్ను వేధిస్తునే ఉన్నారు. వారంద‌రికీ ఇదే నా స‌మాధానం. ఈ ఘ‌న‌త ఒక్క రోజులో వ‌చ్చింది కాదు. ఎన్నో ఏళ్ల నా క‌ష్టానికి ఫ‌లితం ఇది. అండ‌గా నిలిచిన అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు` అని ప్రియాంక చెప్పింది. కాగా త్వ‌ర‌లోనే హాలీవుడ్లోనూ నిర్మాత‌గా రాణించాల‌న్న‌ది ఆమె ప్లాన్‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news