Gossipsప్రియాంక బెడ్ రూమ్ లోకి కెమెరామెన్..?

ప్రియాంక బెడ్ రూమ్ లోకి కెమెరామెన్..?

బాలీవుడ్ కం హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈమధ్యనే తన కన్నా చిన్న వాడైనా నిక్ జోనాస్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లాడిన ప్రియాంకా చోప్రా వారి అన్యోన్యతను చూపించేలా రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ప్రేమించి పెళ్లాడినా కొందరు కేవలం ఇరువురి అవసరాల కోసం పెళ్లాడారని కామెంట్స్ వచ్చాయి. అయితే వాటికి సమాధానంగా నిక్ తో తన ప్రేమను పంచుతూ ప్రియాంకా కొన్ని పిక్స్ షేర్ చేస్తుంది.

అందులో భాగంగా లేటెస్ట్ గా ప్రియాంకా, నిక్ బెడ్ రూం పిక్స్ కూడా షేర్ చేసింది. అసలు భార్యా భర్తలు ఇద్దరు బెడ్ రూం లో ఉంటే అక్కడ కెమెరా మ్యాన్ కు ఏం పని.. కేవలం ఫోటోల కోసం తమ బెడ్ రూం దాకా అతన్ని రాణిస్తారా అంటూ ప్రియాంకా మీద ఫైర్ అవుతున్నారు నెటిజెన్లు. నిక్, ప్రియాకా ఇద్దర్ ప్రణయ కాలంలో ఉన్న టైంలో కెమెరా క్లిక్ మనిపించారు. అయితే అక్కడ వారిద్దరు రొమాన్స్ మూడ్ లో ఉన్నప్పుడు కెమెరీ మ్యాన్ కు అక్కడ ఏం పని అంటున్నారు.

పబ్లిసిటీ పిచ్చి ఉండొచ్చు కాని మరి ఇంత దారుణంగా ఉండొద్దని కొందరి కామెంట్స్. ఏది ఏమైనా పెళ్లి తర్వాత తన హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ప్రియాంకా సినిమాల్లో కొనసాగే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. మరి ప్రియాంకా, నిక్ ల అనుబంధం ఎలా ఉండనుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news