ప్రియాంకా రేంజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

priyanka-slippers-rate

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా క్వాంటికో సీరీస్ తో హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో నటిస్తున్న ఆమె అక్కడ నటీనటులతో మంచి పరిచయాన్ని పెంచుకుంది. ఇక ఈమధ్యనే అమెరికా నటి మేఘన్ మార్కల్ వివాహానికి హాజరైంది ప్రియాంకా చోప్రా. బ్రిటన్ కుమారుడు హారీతో మేఘన్ మార్కల్ పెళ్లని తెలుసుకుని ఆ పెళ్లిలో తాను స్పెషల్ గా కనిపించాలని అనుకుంది ప్రియాంకా చోప్రా.

అందుకే పెళ్లిలో కోసం ఆమె 1.34 లక్షల విలువైన చెప్పులతో అక్కడ దర్శనమించ్చింది. ఏదైనా పెళ్లిలో బట్టల ఖర్చు ఇన్ని లక్షలు.. కాస్టూం ఖర్చు ఇన్ని వేలు అని చర్చించుకుంటాం లాని మొదటిసారి పెళ్లిలో ప్రియాంకా చెప్పుల గురించి ప్రస్థావించడం జరిగింది. హాలీవుడ్ లో కొద్దిపాటి ఇమేజ్ సంపాదించిన ప్రియాంకా చోప్రా స్వరోక్సి క్రిస్టల్ డిజైన్ తో ఆ చెప్పులను తయారు చేయించడం జరిగింది.

అక్కడ వారికి ఇది సాధారణ వార్త కావొచ్చు కాని ప్రియాంకా ధరించిన చెప్పుల ధర ఇంత అని తెలిసి సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. బాలీవుడ్ లో నటించి తద్వారా హాలీవుడ్ ప్రమోట్ అయిన ప్రియాంకా ఈ రేంజ్ లో అక్కడ వారిని ఇంప్రెస్ చేయాలని అనుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

Leave a comment