షాక్ : చిన్నప్పటి నుండి ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక..

30

బాలీవుడ్ టూ హాలీవుడ్ ప్రమోట్ అయిన ప్రియాంకా చోప్రా అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా కాదనేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ హీరో నిక్ జోనాస్ ను పెళ్లాడేందుకు సిద్ధమైంది. ఈమధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించిన ప్రియాంకా హాలీవుడ్ సినిమాలు చేస్తున్నా ఇక్కడ వాణిజ్య ప్రకటనలను చేస్తుంది.

అందులో ముఖ్యంగా ఆస్తమా తగ్గించే సిప్లా కూడా ఒకటి. దానికి ప్రచారకర్తగా ఉంటుంది ప్రియాంకా చోప్రా వ్యవహరిస్తుంది. దాన్ని ప్రమోట్ చేస్తున్న క్రమంలో తనకు ఐదేళ్ల వయసు నుండి ఆస్తమా ఉందన్న షాకింగ్ న్యూస్ బయట పెట్టింది ప్రియాంకా. ఆస్తమా తనని ఇబ్బంది పెట్టిందని అయితే అది ఇప్పుడు తనకు దూరమైందని అంటుంది ప్రియాంకా.

ఆస్తమా ఉన్న వారికి సిప్లా పర్ఫెక్ట్ మెడిసిన్ అంటుంది. ప్రకటనలో భాగంగా తన వ్యక్తిగత విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది ప్రియాంకా. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంకాకు ఆస్తమా ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. అయితే వ్యాధులు సెలబ్రిటీస్ కు అతీతం కావు కదా.. సో సిప్లా ప్రమోషన్స్ లో ప్రియాంకా బయట పెట్టిన తన జబ్బు తెలుసుకుని అందరు షాక్ అవుతున్నారు.

Leave a comment