కన్ను కొట్టిన అమ్మాయి ఫేస్ బుక్ ఓనర్ నే దాటేసింది..ఒక్క సైగ తో బీభత్సమైన ఫాలోయింగ్..!

priya-varrier-mark

సోషల్ మీడియా సంచలనం.. కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను డిస్ట్రబ్ చేసిన ప్రియా వారియర్ ఇప్పుడు మరింత క్రేజీగా మారింది. ఏకంగా ఫేస్ బుక్ ఫౌండర్ జుకర్ బర్గ్ నే దాటేసింది ఈ అమ్మడి. ఓవర్ నైట్ స్టార్ గా ఒరు ఆధార్ లవ్ సాంగ్ టీజర్ తో సంచలనం సృష్టించిన ప్రియా ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇక ఆమె ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ 45 లక్షలకు చేరుకోవడం విశేషం. ఫేస్ బుక్ ఓనర్ జూకర్ బర్గ్ ను కేవలం 40 లక్షల మంది మాత్రమే ఫాలో చేస్తున్నరు. ఆయన్ను కూడా దాటేసి ప్రియా సరికొత్త రికార్డ్ సృష్టించిందు. మలయాళ భామ అయిన ప్రియా ఆ సాంగ్ టీజర్ తో తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు తెచ్చుకుంటుంది. చూస్తుంటే అమ్మడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుందని అనిపిస్తుంది.

క్రేజ్ లో ఆమె తర్వాతే ఎవరైనా అనే పరిస్థితి వచ్చింది. అందుకే పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ తన తర్వాత సినిమాలో ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. అల్లు అర్జున్, రిషి కపూర్ లాంటి వారు కూడా ప్రియా సైగలకు ఫిదా అయ్యారు.

Leave a comment