గరుడవేగ డైరెక్టర్ కి లక్కీ బొనాంజ…3 పెద్ద హీరోల మల్టీస్టారర్ రెడీ

garuda vega

తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టార్ మూవీస్ జోరందుకున్నాయి. ఒకరు వెంట మరొకరు ఇలా హీరోలంతా ఈ మల్టీస్టార్ మూవీస్ కి ఒకే చెప్పేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ ఇండ్రస్ట్రీలో కూడా చక్కటి స్నేహ వాతావరణం ఏర్పడేలా చేస్తుందనడంలో సందేహమే లేదు. కొద్దీ కాలం నుంచి చిన్న హీరో పెద్ద హీరో అనే బేధం లేకుండా అందరూ ఈ తరహా సినిమాల్లో నటించడానికి తెగ ఆరాటపడిపోతున్నారు.

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కేందుకు సిద్దమవ్వగా, హీరో రానా, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్‌లో మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఇటీవల గరుడవేగతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు తన తరువాత చేవ్యబోయే ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఒకవైపు గరుడవేగ చిత్రానికి సీక్వెల్‌‌గా గరుడవేగ-2 చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పనులు చేస్తూనే.. మరో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నటీనటుల ఎంపిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రానా, నితిన్‌లతో పాటు నారా రోహిత్ కూడా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు యంగ్ హీరోలతో క్రియేటివ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించే ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2018 జనవరిలో సెట్స మీదకు . ‘త్రీ కజిన్స్’ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.

Leave a comment