కోలీవుడ్ హీరోలను వణికిస్తున్న ప్రభాస్..!

38

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహోతో మరిన్ని సంచలనాలకు సిద్ధమయ్యాడు. సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సాహో సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసిన సాహో సినిమాకు తెలుగులో లైన్ క్లియర్ గ ఉంది.

అయితే తమిళ, హింది భాషల్లో సాహోకి గట్టి పోటీ ఉంది. కోలీవుడ్ లో సూర్య, అజిత్ సినిమాలు ఆగష్టులోనే రిలీజ్ ప్లాన్ చేశారు. సాహో టీజర్ చూశాక కోలీవుడ్ హీరోల్లో వణుకు మొదలైందని తెలుస్తుంది. సాహో రిలీజ్ తర్వాత కనీసం రెండు వారాలు గ్యాప్ తో తమ సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సాహో టీజర్ అద్భుతమైన యాక్షన్ ప్యాక్ తో వచ్చింది. టీజర్ చూసిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలన్నంత ఎక్సైటింగ్ లో ఉన్నారు.

అందువల్లే ఎందుకు వచ్చిన రిస్క్ అని సాహో రిలీజ్ వారం ముందు వారం తర్వాత తమిళ సినిమాలేవి రిలీజ్ చేయడానికి సాహసం చేయట్లేదని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో కచ్చితంగా మరోసారి తన స్టామినా తెలియచేసేలా ఉంటుందని అంటున్నారు. ఆగష్టు 15న సాహో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. చైనా తప్ప ఓవర్సీస్ రైట్స్ దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ 65 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు.

Leave a comment