సాహో అసలు సీక్రెట్ చెప్పిన ప్రభాస్..!

prabhas-about-sahoo-movie

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సినిమా కోసం దుబాయ్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ప్రభాస్ మొదటిసారి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఆమెకు ఈ సినిమాలో మంచి రోల్ దొరికిందట. సినిమా మొదలయ్యేది ఆమె పాత్ర ద్వారానే అని అన్నాడు ప్రభాస్. అంతేకాదు సినిమాలో 11 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయని టాప్ సీక్రెట్ చెప్పాడు. బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోని అదే రేంజ్ లో ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు.

ఇక తనకు ఇష్టమైన సినిమాలు షోలే, దబాంగ్ అని చెప్పిన ప్రభాస్ సాహో తర్వాత ఎలాంటి సినిమాకు కమిట్ అవలేదని.. త్వరలోనే తర్వాత సినిమా డీటైల్స్ చెబుతామని చెప్పాడు. సాహో తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది.

Leave a comment