ప్రభాస్ కి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

96

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. తాజాగా ప్రతిష్ఠాత్మక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్-10లో కేవలం ఒకేఒక్క టాలీవుడ్ హీరోకు మాత్రమే స్థానం లభించింది. టైమ్స్ 2018కి గాను టాప్50 సెలబ్రిటీలతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేసింది.

ఈ జాబితాలో ఇప్పుడు జాతీయ స్థాయిలో స్టార్ హీరోగా ఒక్క వెలుగు వెలిగిపోతున్న ప్రభాస్ కి షాక్ తగిలింది. ప్రథమస్థానం బాలీవుడ్ నయా సెన్సేషన్ విక్కీ కౌశల్, ద్వితీయ స్థానంలో ఫుట్ బాల్ ప్లేయర్, మోడల్ ప్రథమేశ్ మౌలింకర్, తృతీయ స్థానంలో రణవీర్ సింగ్, ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు.

ఇక టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 12వ ర్యాంక్ ఇచ్చారు. మొన్నటి వరకు బాహుబలి తో జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్న ప్రభాస్ కి 12వ ర్యాంక్ రావడం..విజయ్ దేవరకొండకు నాలుగో ర్యాంక్ రావడం నిజంగా షాకింగ్ విషయమే అంటున్నారు సినీ అభిమానులు.

Leave a comment