మరో యుద్ధానికి సిద్దమవుతున్న ప్రభాస్, రానా..!

prabhas and rana movie details

బాహుబలి తెలుగు సినీ చరిత్రలోనే ఒక దృశ్య కావ్యం అని చెప్పవచ్చు, యావత్ భారత దేశం అంతటా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చుసిన విషయం తెలిసిందే. అటు తరువాత ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు, ఎన్నో బాలీవుడ్ సినిమాలకు సాధ్యం కానీ 1500 కోట్ల మార్కి ని అవలీలగా అందుకుంది మన బాహుబలి 2. ఇందులో బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా పోటీపడి నటించారు. సినిమా ఆధ్యంతం వీరి నటన ప్రత్యక ఆకర్షణగా నిలిచింది.

అయితే వీరిద్దరూ కలిసి మరోసారి నటించే అవకాశం ఉందని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్. ప్రముఖ దర్శకుడు దశరధ్ ఈ మధ్య ప్రభాస్ కి ఒక కథ వినిపించారని, ఆ కథ ప్రభాస్ కి కూడా నచ్చిందని సమాచారం. దశరధ్ గతంలో సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్ర ఉందని, ఆ పాత్ర రానా చేస్తే బాగుంటుందని దశరధ్ చెప్పారట. ఇక రానా కి కూడా త్వరలోనే దశరధ్ ఈ కథ వినిపించనున్నారట. రానా కి కూడా ఈ కథ నచ్చితే త్వరలోనే మరో సారి రానా, ప్రభాస్ కలిసి నటించే అవకాశం ఉంది.

Leave a comment