ఖైది నంబర్ 150 సీక్వల్ లో పవన్ కళ్యాణ్…

chiru pawan

మెగాస్టార్ పదేళ్ల తర్వాత సత్తా చాటేలా చేసిన ఖైది నంబర్ 150 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. మురుగదాస్ డైరెక్ట్ చేసిన తమిళ కత్తి సినిమా రీమేక్ గా వచ్చిన ఈ ఖైది నంబర్ 150 మూవీ మెగాస్టార్ రేంజ్ తెలియచేసింది. ఇక ఈ సినిమా దర్శకుడు మహేష్ స్పైడర్ సినిమా చేశాడు. ఈ నెల 27న ఆ సినిమా రిలీజ్ అవబోతుంది.

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ పవర్ స్టార్ గురించి మాట్లాడటం జరిగింది. గజిని తెలుగు రీమేక్ లో పవన్ నటింపచేయాలని అల్లు అరవింద్ ప్రయత్నించినా అది కుదరలేదని. ఇక తాను కూడా చాలా సార్లు పవన్ కు స్టోరీలు వినిపించే ప్రయత్నం చేశానని అన్నారు. ఇక ఈమధ్య పవన్ ను కలిసి మురుగదాస్ తనకు కత్తి అదేనండి ఖైది నంబర్ 150 సినిమాలో లానే సోషల్ మెసేజ్ ఉన్న కథ కావాలని.. అలాంటి కథ ఉంటే తప్ప కుండా సినిమా చేస్తానని అన్నారట. ప్రస్తుతం సినిమాలైతే చేస్తున్న రానున్న ఎన్నికలకు ఉపయోగపడేలా సినిమాలను తీయాలని పవర్ స్టార్ ప్లాన్.

మురుగదాస్ కూడా అందుకు సరే అన్నట్టు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చే సినిమా తప్పకుండా ఖైది నంబర్ 150 సీక్వల్ గా భావించొచ్చు. అటు పొలిటికల్ మీటింగ్స్ తో పాటు సినిమాలకు టైం కేటాయిస్తున్న పవర్ స్టార్ ఇలాంటి టైంలో సోషల్ మెసేజ్ సినిమాతో వస్తే కనుక ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్ త్రివిక్రం సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న త్రివిక్రం మూవీ దసరాకు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారట.

 

Leave a comment