కీర్తి సురేష్ తో మరోసారి ఎనర్జిటిక్ స్టార్..!

Keerthy Suresh

హిట్ కోసం తపిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ కు నేను శైలజ అంటూ సూపర్ హిట్ ఇచ్చాడు కిశోర్ తిరుమల. ఆ సినిమాతో మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆ సినిమా అమ్మడికి బీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో లీడింగ్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ఓ పక్క పవన్ సినిమాల్లో నటిస్తూ మరో పక్క మహానటిగా సావిత్రి బయోపిక్ లో ఛాన్స్ పట్టేసింది.

తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మడు అదిరిపోయే అవకాశాలను అందుకుంటుంది. విజయ్ సూర్య లాంటి స్టార్స్ తో నటిస్తున్న కీర్తి సురేష్ తెలుగులో తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన హీరో రామ్ తో మరోసారి జతకట్టబోతుంది. దిల్ రాజు బ్యానర్లో నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారట. ఇప్పటికే చేతినిండా సినిమాలున్న అమ్మడు ఈ సినిమాతో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది.

ఇప్పటికే నక్కిన త్రినాధరావు తీసిన నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కోసం పనిచేసిన అనుభవంతో డైరక్షన్ వర్క్ మెచ్చిన కీర్తి కథ వినగానే ఓకే చెప్పేసిందట. దిల్ రాజు రామ్ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

 

Leave a comment