Gossipsఆ డైరెక్టర్ పై పోసానికి అంత కోపం వచ్చిందా ..?

ఆ డైరెక్టర్ పై పోసానికి అంత కోపం వచ్చిందా ..?

 

అందరూ వచ్చి నంది అవార్డుల మీద గోల చేస్తున్నారు నేను రాకపోతే కిక్ ఉండదేమో.. అనుకున్నాడో ఏమో మన మెంటల్ కృష్ణ . కొద్ది రోజుల నుంచి ఒకటే రచ్చ చేస్తున్నాడు. అవార్డుల ఎంపికలో రాజకీయం జరిగిందని చిత్ర పరిశ్రమలోని కొందరు గగ్గోలు పెడుతుండడంతో చివరకు మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా బాలకృష్ణ డైరెక్షర్ గా పేరు సంపాదించిన బోయపాటి శ్రీనుపై పోసాని బాణం గురిపెట్టాడు. తన మాటల తూటాలతో దాడి చేసాడు. తన ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్ అయ్యాక తనను విస్మరించిన బోయపాటి పై పంచ్ లు పేల్చాడు పోసాని.

సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దగ్గర బోయపాటిని అసిస్టెంట్ గా చేర్చిన పోసాని, నాగిరెడ్డి అవార్డుకు బోయపాటి అర్హుడా అంటూ ఎన్నో సామజిక కుటుంబ చిత్రాలు డైరెక్ట్ చేసిన ముత్యాల సుబ్బయ్య సినిమాలతో ఆ అవార్డు వచ్చిన దర్శకుడి సినిమాలను పోల్చి చూడండి అంటూ బోయపాటి పేరు ప్రస్తావన లేకుండా పోసాని పంచ్ వేశాడు.

లెజెండ్ కు ఉత్తమ దర్శకుడు అవార్డు ప్రకటించి.. మరో ఏడాది బోయపాటికి నాగిరెడ్డి అవార్డు, నిర్మాత కానీ కీరవాణికి చక్రపాణి అవార్డు ప్రకటన కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతటితో పోసాని ఊరుకుంటాడా ఇంకా ఎవరినన్నా ఉతికి ఆరేస్తాడా ..? అనేది వేచి చూడాలి. ఏమైనా పోసాని ఎంత కాంట్రవర్సీ చేసినా అది కేవలం వినోదంగా చూసేవారు ఎక్కువయిపోయారు. అంతేనా రాజా !

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news