Gossipsపూరి, రామ్ ఆ విషయంలో మ్యాటర్ చెడిందట..!

పూరి, రామ్ ఆ విషయంలో మ్యాటర్ చెడిందట..!

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయ్యిది. పూరి హిట్టు కొడితే ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. అయితే సినిమా హిట్ అయిన తర్వాత రామ్ సినిమా ప్రమోషన్స్ లో కాని.. విజయ యాత్రలో కాని అసలు కనబడలేదు. రామ్ అమెరికా వెళ్లాడు కాబట్టి విజయయాత్రలో పాల్గొనలేదని అనుకున్నారు. కాని అసలు కారణం అది కాదట.. సినిమా ఒప్పుకున్నప్పుడు తక్కువ రెమ్యునరేషన్ కు చేసినా సూపర్ హిట్ అవడంతో రామ్ ఎక్స్ ట్రా ఎమౌంట్ అడిగాడట.

దానికి పూరి ఒప్పుకోకపోవడంతో రామ్ ఆఫ్టర్ రిలీజ్ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నాడట. అయితే సక్సెస్ మీట్ లో రామ్ లేకపోతే బాగుండదని పూరి రామ్ కు పిలిచి అతను అడిగినంత కాకున్నా కొంత ఇస్తానని మాట ఇచ్చాడట. అందుకే అమెరికా నుండి వచ్చి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పార్టీలో పాల్గొన్నాడు రామ్. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో పూరి, ఛార్మి చేసే ఓవరాక్షన్ కూడా రామ్ కు నచ్చలేదని అందుకే రాం ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నాడని అన్నారు.

ఫైనల్ గా రామ్ అడిగినంత కాకున్నా పూరి ఎంతోకొంతసెట్ చేయడంతో మళ్లీ ఇద్దరు కలిసి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ కెరియర్ లో ఇప్పటివరకు హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కూడా ఇదే అవడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వారం వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా ఢీలా పడటంతో రామ్ కు బాగా ప్లస్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news