Gossipsపూరి ఆ హీరోయిన్‌ను అన్యాయం చేశాడే...

పూరి ఆ హీరోయిన్‌ను అన్యాయం చేశాడే…

సవ్యసాచి, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలతో తెలుగులో కెరియ‌ర్ స్టాట్ చేసి కుర్రకారుకు మతిపోగొట్టిన నిధి అగర్వాల్ మ‌రో సారి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది. ఇటీవలే ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ అందానికి తెలుగు ప్రేక్ష‌కులు మామూలుగా ఫిదా అవ్వ‌డం లేదు. అక్కినేని హీరోల‌ సినిమాల్లో న‌టించిన నిధి ఎంతగా ట్రెడిషన్ ట్రై చేసినా…. ఆమెలోని హాట్ యాంగిల్ మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. నేటితరం భామగా ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను చూపుతూనే ఉంటుంది.

తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ తో పాటుగా మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ న‌టించింది. పూరి-రామ్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం గురువారం విడుద‌ల అయింది. ఈ సినిమాలో నిధి కొత్త లుక్స్‌తో అందాలు ఆర‌బోస్తు ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేసింది. గ్లామర్ పరంగా నభా నటేష్ తో పోటీ పడిన నిధి అగర్వాల్ కి ఈ సినిమా ప‌రంగా మంచి రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాలో నిధి పాత్ర‌కు పూరి అన్యాయం చేశార‌ని టాక్ వ‌చ్చింది.

అయితే మిస్టర్ మజ్ను, సవ్యసాచి సినిమాలో ఫ్లాప్ అయినా కూడా నిధికి మంచి ప్ర‌యార్టీ లభించింది. కానీ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో మాత్రం పూరీ నభా నటేష్ కు ఇచ్చినంత ప్ర‌యార్టీ కూడా నిధి అగర్వాల్‌కి ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లో సత్యదేవ్ లవర్ గా మెదడుకు సంబంధించిన రీసెర్చర్ పాత్ర‌లో నిధి న‌టిస్తుంది. అయితే ఆమెకు మంచి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో నిధి కేరెక్ట‌ర్‌పై యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. పూరి అటు న‌బా న‌టేష్‌కు మంచి రోల్ ఇచ్చి… నిధికి కాస్త అన్యాయం చేశాడ‌నే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news