Gossipsప్రభాస్ ను పొగడ్తలతో పడేస్తున్న పూజా హెగ్దె..!

ప్రభాస్ ను పొగడ్తలతో పడేస్తున్న పూజా హెగ్దె..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే ఆల్రెడీ రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక మూడవ షెడ్యూల్ కు రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దె ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. ప్రభాస్ లాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని అతంతో స్వీట్ పర్సన్ అని.. ఇంత స్టార్ డం ఉన్నా అతను చాలా కూల్ గా ఉంటారని చెబుతుంది పూజా. రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా మూడవ షెడ్యూల్ కోసం తాను ఈగర్ గా ఎదురుచూస్తున్నాను అంటూ ప్రభాస్ ను పొగుడుతూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది పూజా హెగ్దె.

డిజే తర్వాత పూజా ఫేట్ మారిపోయిందని చెప్పాలి. ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమాలో నటించిన పూజా హెగ్దె ఇప్పుడు మహేష్ మహర్షి సినిమా కూడా చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో కూడా ఛాన్స్ కొట్టేసింది. కెరియర్ మొదట్లో కాస్త తడపడ్డా ఇప్పుడు అమ్మడు వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటూ అదరగొడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news