హృతిక్ ను ఘోరంగా అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..

45

మాస్క్ అంటూ కోలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్దె తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా అశుతోష్ గోవారికర్ డైరక్షన్ లో వచ్చిన మోహెంజోదారో సినిమాతో బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హృతిక్ పక్కన ఛాన్స్ అంటే బాలీవుడ్ కన్నంతా ఆమెపైనే. కాని ఆ సినిమా ఘోరమైన ఫలితాన్ని అందుకుంది.

ఆ సినిమా తర్వాత తెలుగులో బన్ని దువ్వాడ జగన్నాథం అమ్మడిని నిలబెట్టింది. సినిమాలో బికిని లుక్స్ కుర్రాళ్ల మతులు పోగొట్టేలా చేసింది. బక్కపలుచని భామలో ఇన్ని అందాలు దాగున్నాయా అనుకుంటూ సర్ ప్రైజ్ అయ్యారు. అంతే ఇక అక్కడ నుండి అమ్మడికి క్రేజీ ఛాన్సులు వచ్చి పడుతున్నాయి. ఇటీవలే సాక్ష్యం అంటూ వచ్చి సర్ ప్రైజ్ చేసిన పూజా తెలుగులో ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత, మహేష్ తో మహర్షి సినిమాలు చేస్తుంది.

రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆమె కెరియర్ గురించి ప్రస్థావించిన పూజా మొహెంజోదారో సినిమాపై మాట్లాడేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. ఆ సినిమా తనకో చేదు జ్ఞాపకమని.. గతం గతః అంటూ చెప్పుకొచ్చింది. హ్రితిక్ లాంటి స్టార్ హీరో సినిమాపై ఆమె ఇలాంటి కామెంట్ చేయడం ఆమె బాలీవుడ్ కెరియర్ కు మంచిదో కాదో కాని పూజా మాత్రం ఆ సినిమా పేరు ఎత్తేందుకు ఇష్టపడలేదు. ప్రస్తుతం హౌజ్ ఫుల్ లో ఛాన్స్ పట్టేసిన పూజాలో బాలీవుడ్ ఆశలు ఉన్నాయని తెలుస్తుంది.

Leave a comment