కోరిక తీర్చుకున్నపూజ హెగ్డే..!

pooja hegde new still

ఒక లైలా కోసం , ‘దువ్వాడ జగన్నాధమ్’ హీరోయిన్ పూజాహెగ్డే ఎట్టకేలకు తన కోరికను తీర్చేసుకుంది. తనకిష్టమైన బీఎండబ్ల్యూ కారుని కొనుక్కోవాలన్నది ఆమె డ్రీమ్. ఎట్టకేలకు ఆ కోరిక తీరడంతో ఇప్పుడు బెంగుళూరు, ముంబై వీధుల్లో తెగ  చక్కర్లు కొడుతోంది ఈ మిస్ ఇండియా బ్యూటీ   . అందుకు సంబంధించిన ఫోటోని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

బీఎండబ్ల్యూ సరే .. సినిమాల సంగతేంటి అని  ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన ఈ భామ , ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా  కొట్టలేదు  . అయినా సినిమాలతో బిజీగానే వుంది. ఇటు టాలీవుడ్ , అటు బాలీవుడ్  ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పుడు  సల్మాన్‌ఖాన్ న్యూప్రాజెక్ట్ ‘రేస్ 3’లోనూ ఛాన్స్ కొట్టేసింది.

Leave a comment