చేసిన తప్పుకి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కి సారీ చెప్పిన పూజ హేగ్దే..!

95

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యమైనవారంతా వచ్చారు. కానీ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఆ సినిమా హీరోయిన్ పూజ హెగ్డే మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆమె ఎందుకు రాలేదు..? కారణం ఏంటి అనే సవాలక్ష సందేహాలు అందరికి వచ్చాయి. అయితే ఆమె బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ ఫంక్షన్ కి హాజరుకాలేకపోయిందట.

పూజ తన షెడ్యూల్ ని మహర్షి తదుపరి ఇటలీ షెడ్యూల్ కోసం, బాలీవుడ్ లో నటిస్తున్న మరో సినిమా కోసం కేటాయించింది.ఆ తరువాత ప్రభాస్ తో జిల్ రాధాకృష్ణ సినిమాలోనూ నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ డేట్ లు ఖాళీలేవు. అసలు ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్ అంటే ఎంత క్రేజ్ .. ఆ హీరోయిన్ ఇంటర్వ్యూల కోసం మీడియా వెంటపడుతుంటుంది. దీంతో పాటు అనేక సినిమా ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి. కానీ పూజ వీటిల్లో ఏ ఒక్క కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా కనిపించడంలేదు.

అందుకే తన పరిస్థితి గురించి త్రివిక్రమ్ , ఎన్టీఆర్ లకు వివరించి సారీ కూడా చెప్పేసిందట. అరవింద సమేత హిట్ అయ్యిందా.. పూజకి ఇక తిరుగుండదు. ఎందుకంటే ఇప్పటివరకు పూజ చేతిలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ యావరేజ్ సినిమాలే. సో ఈ సినిమాలో టైటిలి రోల్ పోషిస్తున్న ఆమెకు ఈ సినిమా హిట్ అయితే టాప్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చేస్తుంది అనడం లో సందేహమే లేదు.

Leave a comment