మెగాస్టార్ చిన్న అల్లుడు పై దారుణమై ట్రోలింగ్..పోలీసు కేసు..

1

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ ఆ మద్య ‘విజేత’మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమలో కళ్యాణ్ దేవ్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే మెగా హీరోలు అనగానే ఇండస్ట్రీలో కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతో ఎక్స్ పెక్టేసన్స్ ఉంటాయి..అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ కాలేదని మొదటి సినిమాలోనే మనోడు ఢీలా పడ్డాడని ఆ మద్య మెగా ఫ్యాన్స్ నుంచి టాక్ వినిపించింది.

తాజాగా కళ్యాణ్ దేవ్ పై కొంత మంది ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటో కింద దారుణమైన కామెంట్స్ పెడుతూ నానా అల్లరి చేస్తున్నారట దీనిపై పోలీసులకు కల్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోల కింద దారుణమైన కామెంట్లు చేస్తున్నారని… వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా ఫిర్యాదు స్వీకరించిన సైబర్ పోలీసు అధికారులు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాస్తామని… కామెంట్లు చేసిన వారి వివరాలు, ఐపీ అడ్రస్ సేకరించి ఎలాంటి వారైనా తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పారు.

Leave a comment