వాల్మీకికి కోర్టు తిప్పలు..!

Petition Filed Against Valmiki Title In Court

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ వాల్మీకి మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో మొదలుకొన్ని టీజర్, సాంగ్ ప్రోమో‌ల వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ మెగా ఛేంజ్ ఓవర్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనుండటంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్‌కు ఎక్కడలేని తలనొప్పి పట్టుకుంది.

వాల్మీకి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు అదే టైటిల్ విషయంలో కోర్టు మెట్లు ఎక్కనుంది. బోయ వాల్మీకిల మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమాను తెరకెక్కించారంటూ బోయ హక్కుల సమితి ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా తెలంగాణ హైకోర్టులో వాల్మీకి చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ కాకుండా చూడాలని సదరు చిత్ర యూనిట్‌నై పిటీషన్ వేశారు. దీంతో ఈ సినిమా యూనిట్ తలపట్టుకోంటోంది.

ఇక ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ సరసన పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు. మరి వారికి కోర్టులో ఊరట లభిస్తుందో లేదో చూడాలి.

Leave a comment