అరవింద సమేత ” పెనీవిటి ” వీడియో సాంగ్

చీకటి చీకటి… కమ్మటి సంగటి .. ఎర్రగా కుంపటి .. వెచ్చగా దుప్పటి అంటూ ఒక సన్నటి వెలుతురు ఉన్న హాలో లో ఒక ఫంక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతున్న “పెనివిటి” ఈ పాటలో ఎన్టీఆర్ చాలా వేదనగా ఈ పాటపడుతూ తనలోని బాధను వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ సాంగ్ లో ఫీల్ కనిపిస్తోంది. ఎవరికోసమే ఎదురు చూపులను రాయల సీమ యాసలో వర్ణిస్తూ.. 30 సెక‌న్ల ప్రోమో లో పెనివిటి పాట సాగుతుంది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణంగా నిలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన కాల భైరవ పాడారు. ఇది సినిమాలోని ఎమోషన్‌ని బయటపెట్టే విధాంగా ఉందని తెలుస్తుంది. అస‌లు ఈ విషాదకర పాటలో డాన్సులు ఏంటో.. పెనివిటి అంటూ ఎన్టీఆర్ పాడ‌టం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

Leave a comment